బుధవారం, సెప్టెంబర్ 19, 2018

తాజావార్తలు

thumb

రాజకీయ చదరంగంలో నిలువునా కాలి'పోయాడు' !

September 18,2018 05:35 PM

చదరంగంలో రాజుని రక్షించడానికి భటులు ఎలా అడ్డుపదతారో, రాజకీయ చదరంగంలో తమ తమ నాయకుల కోసం కార్యకర్తలు బలవుతున్నారు. తాజాగా చెన్నూరు టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లో చెలరేగిన చిచ్చులో ఓ కార్యకర్త బలయ్యాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయింపు విషయంలో నల్లాల ఓదేలు, ఎంపీ బాల్క సుమన్ మధ్య వర్గ పోరు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఇందారంలో సెప్టెంబర్ 12న బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి సిద్ధమవగా ఆయనకు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు ర్యాలీ చేపట్టారు.

thumb

రోజా మీద వ్యాఖ్యల చేటు...ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్ !

September 18,2018 04:23 PM

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఈరోజు పెనమలూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే ప్రసాద్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దీనిపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని.. రోజా గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో రోజా వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్ట్టిన కోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులని ఆదేశించింది.

thumb

ఖమ్మం ఎంపీకి ఐటీ షాక్ !

September 18,2018 03:46 PM

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేయడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయంసం అయ్యింది. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎంపీగా గెలుపొందిన పొంగులేటి ఆ తర్వాత టీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఆఫీసులోనే కాక ఖమ్మంలోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు

thumb

ఏపీ నిరుద్యోగులకి శుభవార్త చెప్పిన చంద్రబాబు !

September 18,2018 03:06 PM

ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలిన్చినట్టున్నాయి అందుకే 20 వేల పోస్టుల నియామకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నేటి ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనే దానిపై ఆధికారులతో చర్చించారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

thumb

అందుకే ప్రణయ్ హత్య జరిగింది !

September 18,2018 02:56 PM

లేకలేకపుట్టడం వలన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె, తనను గుండెల మీద తన్నినట్టు మరో యువకుడిని పెళ్లిచేసుకుని తన కళ్ళముందే లెక్కచేయకుండా ఉన్నారన్న అక్కసుతోనే ప్రణయ్‌ను అమృత వర్షిణి తండ్రి మారుతీరావు హత్యచేయించినట్టు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియాకి వివరించారు. బిడ్డపై పెంచుకున్న అతి ప్రేమ, ఆమె తన వద్దే ఉండాలనే బలమైన కోరిక వలెనే ప్రణయ్ హత్యకు బీజం పడిందని ఆయన తెలిపారు. ఈ కేసులో ఏ1 మారుతీరావేనని,

thumb

ఏకంగా సీఎం పీఏ పర్సు, ఫోన్ కొట్టేశారు !

September 18,2018 12:18 PM

వాళ్ళవీ వీళ్ళవీ కొట్టేస్తే కిక్ ఏమి ఉంటుందనుకుందో ఏమో గానీ ఒక దొంగల ముఠా, ఏకంగా రాష్ట్ర సీఎం పీఏ ఫోను, పర్సు కొట్టేసారు. పోలీసుల వివరాల ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద నిధి కందార్ అనే యువతి పీఏగా పనిచేస్తోంది.

thumb

ఈరోజు ఒక్కరోజే పది బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం !

September 18,2018 11:04 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు వచ్చిన కీలక తరుణంలో ప్రభుత్వం నేడు అసెంబ్లీ ముందుకు పది బిల్లులను తీసుకురానుంది. దుకాణాల ఏర్పాటు బిల్లు, సివిల్ కోర్టు సవరణ బిల్లు, ఉర్దూ విశ్వ విద్యాలయం సవరణ

thumb

మన ఎమ్మెల్యేలు శ్రీమంతులే...ఐదో ప్లేస్ లో జగన్ !

September 18,2018 10:57 AM

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులే అత్యంత ధనవంతులని ఓ సర్వేలో తేలింది.

thumb

ప్రభోధానంద అలియాస్ వెంకన్న చౌదరి...సంచలన విషయాలు వెలుగులోకి !

September 18,2018 10:32 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని స్వామి ప్రబోధానంద ఆశ్రమం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవరికీ అంతగా తెలియని ఈ అశ్రమం రెండు రోజుల కిందట వార్తల్లోకి వచ్చింది. నిన్నటి వరకు భక్తులకు మాత్రమే తెలిసిన ప్రభోధానంద తాజా పరిణామాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.

thumb

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.బయటపెట్టిన తల్లి !

September 18,2018 10:06 AM

గత శుక్రవారం తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ తల్లి ప్రేమలత సంచలన ఆరోపణలు చేశారు.

View My Stats