స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే వంశీ

0
370

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన వంశీ.. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP) కోర్సు చేస్తున్నారు. పంజాబ్‌ లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. నిన్న క్లాస్‌కు వెళ్లిన ఆయనకు ఎడమచేయి లాగినట్టు అనిపిస్తుండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడాయనకు ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో వంశీని డిశ్చార్జ్ చేస్తామని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు.

నిత్యం రాజకీయాల్లో బిజీగా వుండే వంశీ.. ఐఎస్‌బీ లో సీటు సాధించి అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చదువుతున్నారు. ఇటీవలి కాలంలో గన్నవరం పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అయితే, వంశీ విజయవాడలో కాకుండా ప్రస్తుతం మొహాలీలో వుంటున్నారు. చదువు నిమిత్తం ఆయన అక్కడే వున్నారు. స్వల్ప అనారోగ్యమే అనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు వంశీ కుటుంబీకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here