A Married Woman Missing Along With The Minor Boy In AP Gudivada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ గుడ్‌మెన్ పేట కాలనీలో ఓ అనూహ్యమైన కేసు వెలుగు చూసింది. తొలుత ఓ అబ్బాయి మిస్ అవ్వగా.. ఆ తర్వాత ఎదురింట్లో ఉండే ఆంటీ మాయం అయ్యింది. దీంతో.. స్థానికంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుడ్‌మెన్ పేట కాలనీలో 15 ఏళ్ల బాలుడు తొలుత అదృశ్యమయ్యాడు. బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ అబ్బాయి.. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దాంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు.. అతని ఆచూకీ కోసం గాలించారు. ఎక్కడా జాడ కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కట్ చేస్తే.. ఎదురింట్లో ఉండే ఓ ఆంటీ కూడా మిస్ అయ్యిందని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న ఆ వివాహిత.. బాలుడు అదృశ్యమయ్యాక మాయం అవ్వడంతో, కచ్ఛితంగా ఏదో మతలబు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులేమో.. ఆ మహిళ మాయమాటలు చెప్పి, తమ కుమారుడ్ని ఎత్తుకెళ్లిందని చెప్తున్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్‌కి పాల్పడిందని పేర్కొంటున్నారు. కానీ.. స్థానికులు మాత్రం వారిద్దరి మధ్య అఫైర్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. వారి మధ్య అక్రమ సంబంధం ఉందా? లేక ఆ వివాహిత బాలుడ్ని కిడ్నాప్ చేసిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.