భార్య భర్తల బంధం వర్ణనాతీతం.. ఒకకంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మ అంటే ఓకన్ను ఏడిస్తే మరో కన్ను నవ్వదని ఎంతో అబ్దుతంగా చెప్పారు వేటూరి.. భార్య భర్తల బంధం కూడా అలానే ఉంటుంది.. ఉండాలి.. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి భార్యాభర్తల మధ్య కలతలు కలహాలు అనేవి సర్వసాధారణం.. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం..
భార్య లేకుంటే భర్త బ్రతుకుకి అర్ధం లేదు.. భర్త లేకుంటే భార్యకి జీవితమే లేదు అనేలా ఉండాలి భార్య భర్తలంటే.. ఈ విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు కొందరు.. చిన్నచిన్న కలహాలకు ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుంటున్నారు.. పగ సాధిస్తున్నారు.. అలాంటి ఘటనే ఒకటి విజయవాడ లో చోటు చేసుకుంది..
విజయవాడ లో వన్ టౌన్ చిట్టి నగర్ లో దుర్గారావు అతని భార్య శ్రావణి నివాసం ఉంటున్నారు.. దుర్గారావు మందుకి బానిసయ్యాడు.. దీనితో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జారుతున్నాయి.. తాజాగా నిన్న మళ్ళీ భార్య భర్తలు గొడవ పడ్డారు.. మాటల యుద్ధంలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు.. చివరికి గొడవ సర్దుమణిగింది.. కాగా గొడవ అనంతరం దుర్గారావు నిద్రపోయాడు.. నిత్యం తాగొచ్చి గొడవపడుతున్న దుర్గారావుతో విసిగిపోయిన శ్రావణికి సహనం సన్నగిల్లింది ..దీనితో అప్పటివరకు గొడవపడి తన మనశాంతిని దూరంచేసిన భర్త ప్రశాంతంగా నిద్రపోవడాన్ని సహించలేక పోయింది అతని భార్య..
స్టో పైన నీళ్ళని కాచి మరుగుతున్న వేడి నీళ్ళని నిద్రపోతున్న భర్త పైన పోసింది.. ఆ వేడికి నిద్రపోతున్న దుర్గారావు పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాడు.. వేడి నీళ్ళకి ఒళ్ళంతా కందిపోయింది .. ఒకపక్క ఒళ్ళంతా మంటగా ఉందని అల్లాడుతూనే మరో వైపు వేడినీళ్లు పోసిన భార్య పైన మండిపడ్డాడు.. వెంటనే బంధువులకి సమాచారమివ్వగా ఇంటికి చేరుకున్న బంధువులు దుర్గారావుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. అనంతరం పోలీసులకి సమాచారం ఇవ్వగా హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు శ్రావణి పైన కేసు నమోదు చేశారు..