మాజీ ముఖ్యమంత్రి పరిపాలన కాలం లో చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో అవినీతీ జరింగిందని ఈ రోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ.. అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. తన అరెస్ట్ పైన ఆగ్రహం వ్యక్తంచేశారు..
నడి రోడ్డు పైన ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు.. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు.. ప్రజల కోసమే నేను పోరాడుతున్న.. ప్రజా సమస్యలపైనా పోరాడుతుంటే అడ్డుకుంటున్నారు.. నేను ఏ తప్పూ చేయకపోయినా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని..
నేను తప్పు చేస్తే నిరూపించమని సవనాలు విసురుతున్న.. నిరూపిస్తారా? నేను ప్రజల తరుపున న్యాయంగా పోరాడుతున్న.. ఎవరెన్ని కుయుక్తులు పన్నిన చివరికి ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు..
ఇప్పటికే టీడీపీ కార్యకర్తల్ని వందల మందిని అరెస్ట్ చేశారు.. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తున్నారు.. అయినా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు కాస్త సంయమనం పాటించాలని సూచించారు.. ప్రజలకోసం ప్రజా సమస్యలపైనా న్యాయంగా పోరాడుతుంటే ప్రస్తుత ప్రభుత్వం మా ప్రయత్నాన్ని అణిచివేసే ధోరణిలో ఉంది.. అయినా నేను బెద్దరను..ఎప్పటికైనా గెలిచేది ధర్మమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
కాగా ఐపీసీ సెక్షన్లు 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్ల కింద చంద్రబాబుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది..
చంద్రబాబు అదుపులోకి తీసుకున్న సీఐడీ ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. అనంతరం 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని సమాచారం.