Amaravati vivadalu.. vastavalu ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఎప్పుడూ వివాదాలే. 2014లో రాష్ట్రవిభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటినుంచి అమరావతి చుట్టూ విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. సీనియర్ జర్నలిస్ట్ కం దుల రమేష్ రచించిన ‘అమరావతి వివాదాలు – వాస్తవాలు ’పుస్తక ఆవిష్క రణ కార్య క్రమం ఈ నెల 8న విజయవాడలో జరగనుంది. ఈ కార్య క్రమం 8వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని కన్వె న్షన్ సెంటర్లో జరగనుంది.
కందుల రమేష్ వివిధ తెలుగు, ఇంగ్లీషు పత్రికలు, న్యూస్ టెలివిజన్ చానళ్లలో సీనియర్ హోదాలో పనిచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పత్రిక ‘ఆంధ్రప్రదేశ్’ చీఫ్ ఎడిటర్ గా ఉన్నా రు. ఆయనఇంగ్లీషులో రాసిన Maverick Messiah : A Political Biographyof N.T. Rama Rao పుస్తకాన్ని పోయినేడాది ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ Penguin Random House ప్రచురించింది. అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావులోని విభిన్నమయిన కోణాలను రచయిత కందుల రమేష్ ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం ఎంతోమంది విమర్శల ప్రశంసలు అందుకుంది.
అమరావతి వివాదాలు-వాస్తవాలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా.ఎన్.తులసిరెడ్డి, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వి శ్రీనివాసరావు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు శివారెడ్డి, జి తిరు పతి రావు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు హాజరవుతారు. సభకు సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్ హాజరవుతారు. అమరావతి చుట్టూ ఎలాంటి వివాదాలు వున్నాయి, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి, అమరావతి భవిష్యత్ వంటి అనేక అంశాలను ఈపుస్తకంలో వివరించే ప్రయత్నం చేశారు. విజయవాడలో జరిగే ఈ పుస్తకవిష్కరణకు రావాలని రచయిత ఆహ్వానిస్తున్నారు.