ఆ బుడతడి వయస్సు ఎనిమిది నెలలే.. చిన్నగా సీఎం చంకలో చేరాడు.. ముద్దుగా ఉందని.. సీఎం జేబులోని పెన్ పట్టుకోబోయాడు.. అది పట్టుతప్పి కిందపడిపోయింది.. కానీ, సీఎం చేతుల మీదుగా.. అది గిఫ్ట్‌గా అందుకున్నాడు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరద బాధితులను గడపగడపకు వెళ్లి పరామర్శిస్తున్నారు.. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు.. ఏఒక్కరూ మాకు సాయం అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని తెలిపారు. ఇక, సీఎం జగన్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. ఎనిమిది నెలల బాబుకి ఆ పెన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు ముఖ్యమంత్రి..
ఇవాళ సీఎం జగన్ పుచ్చకాయలవారిపేటలో పర్యటించారు.. బాధితులను పరామర్శించే సమయంలో.. ఎనిమిది నెలల బాబుతో వచ్చి సీఎంను కలిశారు ఓ మహిళ.. దీంతో, ఆ బాబుని ఎత్తుకున్నారు సీఎం.. బాధితులతో మాట్లాడారు.. అయితే, తాను సీఎం చేతుల్లో ఉన్నానని ఆ బుడ్డోడికి తెలియదు కదా.. సీఎం జేబులో ఉన్న పెన్‌ను లాగేశాడు.. అది కాస్తా కిందపడిపోయింది.. అయితే సీఎం జేబులో ఉన్న పెన్ను మాత్రం మామూలుది కాదు.. ఎందుకంటే.. అది మౌంట్ బ్లాక్ పెన్ను.. దాని విలువ అక్షరాలా రూ.70 వేల వరకు ఉంటుంది.. కానీ, అవి ఏమీ ఆలోచించకుండా.. చంటి బిడ్డ ముచ్చట పడ్డాడని భావించిన ఏపీ సీఎం.. ఆ పెన్నును బుడ్డోడికి గిఫ్ట్‌గా ఇచ్చేశారు. తన పెద్ద మనసు చాటుకున్న సీఎం.. అందరినీ ఆకట్టుకున్నారు.