ఏపీ సర్కార్‌ కొత్త టీవీ చానెల్‌.. ఎందుకో తెలుసా..?

0
1072

ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది.. సొంతంగా ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనుంది సర్కార్‌.. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ చైర్మన్ గౌతంరెడ్డి వెల్లడించారు.. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి త్వరలో కొత్త ఛానల్ వస్తుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.. కొత్త ఛానల్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిల పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, గత ప్రభుత్వం చేసిన అక్రమాల వలన అనేక సమస్యలు వచ్చాయని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో తమ సంస్థ లాభాల బాట పట్టిందని పేర్కొన్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సప్తగిరి పేరుతో దూరదర్శన్‌ చానల్‌ నడుస్తున్న విషయం తెలిసిందే.. తెలంగాణలో యాదగిరి పేరుతో డీడీ ప్రసారాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు.. ఇక, గతంలో పోల్ టాక్స్ వేసి కేబుల్ ఆపరేటర్ల నడ్డి విరిచారు.. కానీ, పోల్ టాక్స్ పై ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దుకు చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు గౌతంరెడ్డి… ఆపరేటర్ల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎంఎస్‌ఓలు, కేబుల్‌ ఆపరేటర్స్ ప్రభుత్వ విధానాలు ప్రజలకు చూపించాలని, ప్రభుత్వాన్ని విమర్శించే పద్ధతిని విడనాడాలని సూచించారు. భారతదేశంలో మొదటిసారిగా ఏపీలో కేబుల్ తో పాటు ఇంటర్ నెట్ అందిస్తున్నాం.. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధి చెందలేకపోయింది.. టీడీపీ హయాంలో చేసిన తప్పులు, టెండర్లలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఎఫ్ఎల్ కు 9 నుంచి 10 లక్షల వరకు కనెక్షన్లు వున్నాయి.. మరో 50 లక్షల బాక్సులను ప్రభుత్వ నిబంధనల లోబడి కొనుగోలు చేస్తామన్నారు గౌతంరెడ్డి..

అయితే, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సొంతంగా ఈ తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్‌ఎల్), ఒక రాష్ట్రం. ప్రభుత్వ సంస్థ, ‘ఏపీ ఫైబర్ న్యూస్’ బ్రాండ్ పేరుతో ఛానెల్‌ని ప్రారంభించనుంది. దాని ఇటీవలి సమావేశంలో, ఏపీఎస్ఎఫ్‌ఎల్‌ బోర్డు ఏపీ ఫైబర్ న్యూస్‌ను ప్రారంభించే ప్రతిపాదనను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ ఛానెల్ తన ఫైబర్-టు-హోమ్ (FTH) నెట్‌వర్క్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వార్తలను ప్రసారం చేస్తుంది. ఈ ఛానెల్ ద్వారా ప్రసారం చేయగల ఇతర కంటెంట్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తున్నాం.. న్యూస్ ఛానెల్‌ని సొంతంగా నిర్వహించాలా..? లేదా..? అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలా.? అనే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నామని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సొంతంగా ఒక టెలివిజన్ న్యూస్ ఛానెల్ మరియు న్యూస్‌ పేపర్‌ కూడా కలిగి ఉన్నారు.. ఇక, వైసీపీ సర్కార్‌ ఏర్పడినప్పటి నుంచి కొన్ని పత్రికలు, చానెళ్లను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.. అవి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. ప్రభుత్వంపై విషంగక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వ పథకాలు, వాటి ఉపయోగం, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా అనేక విషయాలను ప్రజల ముందు పెట్టేందుకు మీడియా రంగంలోకి దిగాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినట్టు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌.. టెలివిజన్ ఛానెల్‌లు, టెలిఫోన్ లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వంటి ట్రిపుల్-ప్లే సేవలకు 10 లక్షల మంది సభ్యులను కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి చందాదారుల సంఖ్యను దాదాపు 50-60 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక ఫలవంతమైతే, రాష్ట్రంలోని 50 శాతం కుటుంబాలు ఎఫ్‌టిహెచ్ పరిధిలోకి వస్తాయి. దీని ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రభుత్వ ఛానెల్ అయినందున, ఎంఎస్‌వోలు దానిని ప్రసారం చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్న మాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here