ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… అసలు పవన్ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాడో..? లేదో..? చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, పవన్ కళ్యాణ్ నడుపుతోన్నది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన పార్టీ అంటూ ఎద్దేవా చేశారు… రాష్ట్రంలో కాపులెవరూ పవన్ కల్యాణ్‌ను నమ్మటం లేదన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు స్క్రిప్ట్, ప్రొడక్షన్ నారా చంద్రబాబు నాయుడుది.. డైరెక్షన్ పక్కన ఉండే నాదెండ్ల మనోహర్‌ది అని.. ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది కదా..! అది కమ్మ జనసేన అని అంటూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అమర్‌నాథ్.
మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నారా లోకేష్‌ని హెచ్చరించారు మంత్రి అమర్‌నాథ్.. టీడీపీ నాయకులు కొందరు దురుద్ధేశంతో భారతమ్మపై మాట్లాడుతున్నారు.. మరోసారి భారతి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించా రు. రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు.. నీకు, బ్రాహ్మణికి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఇంట్లో తేల్చుకోండి.. అంతే.. కానీ, మా చేత బ్రాహ్మణిని తిట్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్? అని మండిపడ్డారు.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే ఆ జాబితా రిలీజ్ చేయొచ్చు కదా? అని సవాల్ చేశారు.. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు గుర్ఖా వాళ్లకు సూటు బూటు వేసి ఫోటోలు తీసి డ్రామాలు ఆడారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.