భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. మా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు జగన్. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రికరణే మా విధామని జగన్ పేర్కొన్నారు.
ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, సమతౌల్యాన్నికి ఇదే పునాది అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడుతూ ప్రగతి సాధిస్తూ.. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ మొదటిస్థానంలో ఉందన్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో.. సాయంత్రం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ హై టీ ఇవ్వనున్నారు. సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే.. ఒకే కార్యక్రమంలో సీఎం జగన్, చంద్రబాబు పాల్గొననుండడంపై ఉత్కంఠ నెలకొంది.
Revanth Reddy : స్వతంత్రంతో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం