పవన్‌ కల్యాణ్‌కు, కేఏ పాల్‌కి తేడాలేదు.. ఏపీ మంత్రి సెటైర్లు

0
492

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్… పవన్‌ కల్యాణ్‌కు కథ, స్క్రీన్ ప్లే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, డైరెక్షన్‌ నాదెండ్ల మనోహర్ అని పేర్కొన్న ఆయన… కేఏ పాల్‌కి, పవన్ పాల్‌కి తేడా లేదు… ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు.. జాకీలు పెట్టీ లేపిన లేవలేని చంద్రబాబుని నువ్వు మోయగలవా అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు జోగి రమేష్‌.. చంద్రబాబు నువ్వు లేవలేవు.. కానీ, మీ ఇంటికి వచ్చి ప్రతాపం చూపిస్తా అంటాడన్నారు. ఇక, మాకు (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ) వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు ఎందుకు మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్పలేక పోతున్నారు..? అంటూ అంటూ ప్రశ్నించారు. పొత్తులతో పొర్లాడటమే మీరు చేస్తున్న పని.. ప్రజలకేం చేశారు? అని నిలదీశారు. ఇప్పుడు కుప్పం నీ గడ్డ కాదు చంద్రబాబు.. అది వైఎస్సార్ అడ్డాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఓడిపోవడం ఖాయం అంటూ జోస్యం చెప్పిన ఆయన.. చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనను, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు మంత్రి జోగి రమేష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here