కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

0
582

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ జరుగుతుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్‌ లైవ్‌ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. గెలుపు ఏకపక్షమే అయినప్పటికీ ప్రతిపక్షంగా వున్న బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.

పోలింగ్ కోసం మొత్తం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 148 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు భద్రతలో నిమగ్నమయి వున్నారు. వైసీపీ, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీ చేయడం లేదు. 2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికలో లక్షకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుది. ఉప ఎన్నిక బాధ్యతను సైతం మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానికి అప్పచెప్పారు అధినేత జగన్.

ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇప్పటివరకూ 11 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు ఓటర్లు, మరోవైపు ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా వుంది.ఆరు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించాయి ఈ.వి.ఎం.లు. వెంటనే స్పందించిన అధికారులు కొత్త ఈ.వి.ఎం.లతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. పోలింగ్ బూత్ లకు తరలివస్తున్న ఓటర్లతో వాతావరణం సందడిగా వుంది. ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్దులు చూశాకే ఓటర్లను అనుమతిస్తున్నారు.
నెల్లూరు: ఆత్మకూరులో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణ. మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్. బారులు తీరిన ఓటర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here