కుట్ర జరుగుతోందని, వాళ్ళ సంగతి చూస్తానంటూ.. మాజమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారు..వ్యక్తిగతంగా కొందరు సొంత పార్టీ వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు..ఎవరు చేస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు..వాళ్ళ సంగతి చూస్తా…హవాలా మంత్రి అని వాళ్ళే అనిపిస్తున్నారు..ప్రతిపక్ష నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు..జనసేన మహిళకి నేను మద్యం తాగి అర్థరాత్రి ఫోన్ చేసినట్లు ఆరోపిస్తున్నారు.
నాపై ఆరోపణలు చేస్తున్న వారితో కొందరు టీడీపీ నేతలతో పాటు మా పార్టీ నేతలు కూడా ఫోన్ టచ్ లో ఉన్నారన్నారు బాలినేని. నాపై జరుగుతున్న కుట్రలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు. నాకు సంబంధం లేని విషయాలలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను నిజంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. మా కుమారుడి పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయటం వల్లే కేసులు ఉపసంహరించుకున్నాం.. ఆయన కూడా నిజాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బాలినేనిని తొలగించిన నాటినుంచి ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తనపై కుట్ర చేసింది ఎవరనేది ఆయన బయటపెడతారేమో చూడాలి.