పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పోసానిపై కేసు

0
71

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదైంది.. అయితే, జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్ కల్యాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిరా… అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు.. గత కొద్ది కాలంగా స్థానిక రెండో జేఎఫ్‌సీఎం కోర్టులో యందం ఇందిరా తరపున వాదనలు వినిపించారు న్యాయవాది ఏవీఎంఎస్‌ రామచంద్రరావు.. చివరకు పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు పేర్కొంది… ఇక, రెండవ జేఎఫ్‌సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506, 507 మరియు 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీసులు.

అయితే, కొన్ని సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని.. ఇదే సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు పోసాని ఇంటిపై దాడి చేయడం కూడా రచ్చగా మారింది.. కాగా, ఈ మధ్యే పోసాని కృష్ణ మురళికి గుడ్‌న్యూస్‌ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమించారు. గత కొన్ని ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు పోసాని కృష్ణ మురళి.. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు. మరోవైపు, విపక్షాలపై, ముఖ్యంగా జనసేన పార్టీ పై విమర్శలు చేయడంలోనూ పోసాని కృష్ణమురళి సక్సెస్ అయ్యారని.. అందుకే ఆయనకు మంచి పదవి కట్టబెట్టారనే విమర్శలు లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here