సిల్క్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు పొందిన వేణు స్వామి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో చర్చగా మారింది.. సెలబ్రిటీల జాతకాలు, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్‌పై, చినిపోయేది ఎవరు, బ్రతికేది ఇంకా ఎన్ని రోజులు ఇలా అనేక అంశాలపై జ్యోతిష్యం చెబుతూ సంచలన సృష్టించే వేణు స్వామి.. చంద్రబాబు అరెస్ట్‌ను ముందే ఊహించారా? అంటే దాదాపు అదే ఆయన గతంలో చెప్పిన వీడియోలో అదే రుజువైంది.. ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో ప్రముఖుల జాతకాలు చెప్పారు వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలతో పాటు ప్రతిపక్ష నేతలు.. ఇతర ప్రముఖుల జాతకాలు చెప్పిన ఆయన.. చంద్రబాబుకి న్యాయపరమైన చిక్కులు కలుగుతాయని ఉగాది పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.. చంద్రబాబుది పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి.. ఆయన జాతక విశ్లేషణ ప్రకారం.. చంద్రబాబు కుటుంబానికి న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వందకు వెయ్యి శాతం ఉందన్నారు.. అదే వీడియోను మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు వేణు స్వామి.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా వేణుస్వామిని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విడియోలో ఎలాంటి వాయిస్ వినిపించడం లేదు. వీడియోలో మాత్రం చంద్రబాబుకు ఏదో పేపర్ అందించారు వేణుస్వామి.. అది ఆయన జాతక పత్రాలు అయి ఉంటాయని నెటిజన్ల ఊహ.. కొంతమంది ఆ వీడియో పాతది అంటే.. కొందరు కొత్తదనే అంటున్నారు.. ఆ వీడియో సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు.. చంద్రబాబు, ఆయన ఫ్యామిలీ గురించి.. ఉగాది పంచాంగ శ్రవణంలో వేణు స్వామి చెప్పిన జాతకం వైరల్ అవుతోంది.