ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం… వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ మోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ… శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది.. అయితే, పలు మార్లు ఈ విషయంలో స్పందించాలని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసినా… వైసీపీ పట్టించుకోలేదు.. ఈ తరుణంలో.. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం…
ఇక, పార్టీలకు శాశ్వత అధ్యక్షుడు, పార్టీలో శాశ్వత పదవులు వర్తించవు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది… పార్టీలకు తరచూ ఎన్నికలు జరగాలని పేర్కొంది… శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధం అంటూ కుండబద్దలు కొట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్.. మొత్తంగా వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకం చెల్లదని తేల్చిచెప్పింది.. ఏ పార్టీలోనూ శాశ్వత అనే పదవులు ఉండకూడదు, అది ప్రజాస్వామ్య విరుద్ధం అని స్పష్టం చేసింది.. దీంతో.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయి. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలతో.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన వైఎస్ జగన్.. 2011 మార్చి12న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు.. ఇక, అప్పటి నుంచి వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే ఉన్న విషయం తెలిసిందే.