Tirupati Crime: అయ్యో..! పేస్ బుక్ ప్రేమ ఎంత పనిచేసింది

0
30

ప్రతి జీవితం ఓ సినిమా.. కానీ ఏ సినిమా ఒక జీవితం కాదు..అనే విషయం చాల కొందిమందికే తెలుసు.. అది తెలిసిన వాళ్ళతో సమస్య ఏముంది తెలియని వాళ్ళకే సమస్య.. ఈ ప్రస్తావన ఎందుకు అంటే ప్రేమ.. తెర మీద ప్రేమకథలు ఎంతో అందంగా ఉంటాయి.. ఎందుకంటే ఆ ప్రేమ కథని పెళ్లితో ముగిస్తారు దర్శకులు.. కానీ నిజజీవితంలో అలా అందంగా ఉండదు కొందరి విషయంలో..

ఇంకా చెప్పాలంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమ కథలు ఎక్కువే అని చెప్పాలి.. సోషల్ మీడియా పుణ్యమా అని పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియా ఫ్లాట్ఫారంలు ప్రేమకి వేదికగా మారాయి.. ఈ ప్రేమని ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి పీఠలెక్కే వాళ్ళు కొందరైతే.. పెద్దల మాటను ధిక్కరించి లగ్గం చేసుకునే వాళ్ళు ఇంకొందరు.. ఆ కోవలోకే వస్తారు ఈ జంట..

వివరాలలోకి వెళ్తే తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీఎన్‌పేట గ్రామంలో యనమల హరిబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.. అతనికి పేస్ బుక్ లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుకన్యతో పరిచయం ఏర్పడింది.. ఈ పరిచయం పెరిగి ప్రేమగా మారింది.. ఆ ప్రేమ పేస్ బుక్ నుండి వాట్సాప్ వరకు చేరింది.. చివరికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళింది..

దానితో 2 నెలల క్రితం ఎవరికీ చెప్పకుండ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. తరువాత ఆ జంట వాళ్ళ అక్క ఇంట్లో తలదాచుకున్నారు.. ఎన్ని రోజులు అక్క ఇంట్లో ఉంటాం అనుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఆ యువకుడు.. విషయం తెలుసుకున్న అమ్మాయి తరుపు వాళ్ళు అబ్భాయి ఇంటికి వచ్చి ఆస్థి మొత్తం అమ్మాయి పేరు మీద రాయాలని పట్టుబట్టారు..

కాగా ఆ అబ్బాయికి తమ్ముడు ఉండడంతో కుదరదని చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు.. దీనితో రెచ్చిపోయిన అమ్మాయి తరుపు వారు రాడ్లు మరియు కర్రలతో అబ్బాయి కుటుంభం పైకి దాడికి దిగారు.. హరిబాబు వాళ్ళ అమ్మని కొట్టారు.. అడ్డుకోబోయిన హరిబాబుని విచక్షణ రహితంగా గాయపరిచారు..

అప్పటివరకు మనకెందుకులే అనుకున్న స్థానికులు పరిస్థితి విషమించడంతో తిరగబడ్డారు..దీనితో అమ్మాయి తరుపు వాళ్ళు పారిపోయారు..స్థానికులు గాయపడిన హరిబాబుని అతని కుటుంబ సబ్యులని హాస్పటిల్ కి తరలించి పోలీసులకి సమాచారం ఇచ్చారు.. దీనితో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here