ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.స్ జగన్ ట్విట్టర్ వేదికగా రాఖీ పున్నమి శుభాకాంక్షలు తేలియాచేసారు.. మీ సంక్షేమమే నా ధ్యేయం.. ఒక అన్నగా, తమ్ముడిగా మీకు ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను.. నా సోదరీమణులందరికి రాఖీ శుభాకాంక్షలు అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు జగన్ మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని..
కాగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు.. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు.. చిట్టి బాబు కుమార్తె వివాహ వేడుకలకి హాజరైన ఆయన తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు..
కాగా సీఎం జగన్ సెప్టెంబర్ 2 వ తేదీన కడపకు రానున్నారు.. జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో పలు అభివృధి కార్యక్రమాలలో భాగంగా ఒకరోజు పర్యటిస్తారు..ఈ నేపథ్యంలోసీఎం కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో సీఎం జిల్లా పర్యటన ఖచ్చితమైన షెడ్యూల్‌ని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు..సీఎం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదిక వద్ద ప్రొటోకాల్ విధివిధానాలు కచ్చితంగా పాటించాలని అన్నారు.