వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు జగన్. బుధవారం తన పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు.
మంగళవారం ఒకవైపు వర్షం కురుస్తోన్నప్పటికీ సీఎం వైయస్ జగన్ వరద బాధితులకు వద్ద వెళ్లి పరామర్శించారు. వారికి తానున్నాంటూ భరోసా ఇచ్చారు. అలుపెరగకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లంక గ్రామాల్లో మొదటి రోజు పర్యటించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం వైయస్ జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు.బుధవారం ఉదయంరాజమహేంద్రవరం నుంచి బయలుదేరి చింతూరుకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. వరద బాధిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటన ప్రారంభం అయింది.