పోలవరం బాధితులకు న్యాయం చేస్తాం.. సీఎం జగన్

0
665

పోలవరం బాధితులకు న్యాయం చేస్తామన్నారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల సమస్యపై సీఎం సమాధానం చెప్పారు.పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్పామో జీవోకూడా ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నాం అన్నారు సీఎం జగన్. ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం కింద ఆరులక్షల 50 వేలు ఇచ్చారు చంద్రబాబునాయుడు. ఈ పరిహారాన్ని 10లక్షలు చేస్తాం అన్నాం. జీవోకూడా ఇచ్చాం. దీనిపై ఆక్షేపణ లేదు. 30-06-2021న జీవో ఇచ్చాం. కళ్లు ఉండి చూడలేని వారిని ఏం చేయలేం.పోలవరం బాధితులకు న్యాయం చేసేందుకు వున్నాం. పునరావాసం కోసం 500 కోట్లు ఇవ్వాలి. అది కూడా బటన్ నొక్కి ఇస్తాం. 2900 కోట్లు కేంద్రం చెల్లించాల్పి వుంది.

పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపుపై ప్రశ్నోత్తరాలతో చర్చ కొనసాగింది. పోలవరం రూ. 10 లక్షలు ఎకరానికి చెల్లిస్తానన్నారా..? లేదా..? అనే అంశంపై ప్రశ్నపై మంత్రి అంబటి స్పందించారు. 2013 చట్టానికి ముందు కేవలం రూ. 1.50 లక్షలు పరిహరం పొందిన వారికి రూ. 5 లక్షలిస్తామన్నారు. ఆ కేటగిరిలో ఉన్న వారికి మిగిలిన రూ. 3.50 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కొల్పోయిన వారికి మొత్తంగా రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందులో కేంద్రం సుమారు రూ. 7.50 లక్షలు ఇస్తుంది.. వారికి మిగిలిన రూ. 2.50 లక్షలిస్తామని హామీ ఇచ్చింది. భూములు కొల్పోయిన వారికి రూ. 10 లక్షలిస్తామనే హామీనే ఇవ్వలేదు. భూములకు రూ. 10 లక్షలు ఇస్తామనే హామీ ఇవ్వనప్పుడు ఎన్ని ఎకరాలు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపుపై ప్రశ్నోత్తరాలతో చర్చ కొనసాగింది. పోలవరం రూ. 10 లక్షలు ఎకరానికి చెల్లిస్తానన్నారా..? లేదా..? అనే అంశంపై ప్రశ్నపై మంత్రి అంబటి స్పందించారు. 2013 చట్టానికి ముందు కేవలం రూ. 1.50 లక్షలు పరిహరం పొందిన వారికి రూ. 5 లక్షలిస్తామన్నారు. ఆ కేటగిరిలో ఉన్న వారికి మిగిలిన రూ. 3.50 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కొల్పోయిన వారికి మొత్తంగా రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందులో కేంద్రం సుమారు రూ. 7.50 లక్షలు ఇస్తుంది.. వారికి మిగిలిన రూ. 2.50 లక్షలిస్తామని హామీ ఇచ్చింది. భూములు కొల్పోయిన వారికి రూ. 10 లక్షలిస్తామనే హామీనే ఇవ్వలేదు. భూములకు రూ. 10 లక్షలు ఇస్తామనే హామీ ఇవ్వనప్పుడు ఎన్ని ఎకరాలు అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here