నటుడు ఆలీ ఇటు సినిమాల్లో, అటు టీవీ షోలలో బిజీగా వుంటారు. నటుడు ఆలీ కుమార్తె వివాహం చేయనున్నారు. ఈనెల 27న వివాహం జరగనుంది. ఈ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు ఆలీ దంపతులు. ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డని, తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలసి ఆహ్వానించిన ఆలి దంపతులు మెగాస్టార్ ని కూడా కలసి తమ ఇంట జరిగే శుభకార్యానికి రమ్మని పిలిచారు. ఆలి కుమార్తె ఫాతిమా డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. అన్వయ కన్వెన్షన్ లో జరిగే ఫాతిమా, షహనాజ్ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నారు ఆలీ దంపతులు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన అలీకి అప్పట్లో రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. ఆ తర్వాత వక్స్ బోర్డ్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది.ఈమధ్య అలీ పార్టీ కూడా మారతాడని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా జగన్ అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమించింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగనున్నారు.