ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఇలా చేయాలి.. పొత్తులపై నారాయణ కీలక వ్యాఖ్యలు

0
56

ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి.. ఈ తరుణంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకో సైలెంట్‌ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని విమర్శించే సాహసం సీఎం వైఎస్‌ జగన్‌ చేయడం లేదంటూ విమర్శించారు. కాగా, గత ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్లగా.. టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడివిడిగా పోటీచేసిన విషయం విదితమే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటూ.. ఆ మధ్య పవన్‌ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు నారాయణ కామెంట్లకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు, దేశానికి గర్వకారణమైన జీ20 సమావేశాలకు నరేంద్ర మోడీ చైర్మన్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమావేశాలకు 20దేశాల‌ ప్రతినిధులు వస్తున్నారు.. ఈ సమావేశాలకి కమలం గుర్తు తరహాలో లోగో పెట్టడం సరికాదు.. వెంటనే ఆ లోగోను మార్చాలని డిమాండ్‌ చేశారు.. మహిళా బిల్లు ఇరవై యేళ్లుగా పెండింగ్‌లో ఉంది.. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆ బిల్లు ఆమోదించాలని డిమాండ్‌ చేశారు సీపీఐ నేత నారాయణ.. జీ20కి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ.. బిల్లును ఆమోదిస్తే మనకి గౌరవం దక్కుతుందన్నారు.. జీ20సమావేశాలకు ముందే‌ మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు.. ఇక, ఈడీ, ఐటీ రైడ్స్‌పై స్పందిస్తూ.. ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చేలా సీబీఐ, ఈడీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగిస్తోందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులపై దాడులు రాజకీయ ‌కోణంలో‌ చేస్తున్నారని ఆరోపించారు.. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని సూచించారు సీపీఐ నేత నారాయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here