ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు చేయటంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవటం సిగ్గుచేటు..ఏడాదికి 41 వేల కోట్లు అప్పులు తెస్తామని ఆరు నెలల్లోనే ప్రభుత్వం 49 వేల కోట్లు అప్పు తెచ్చింది..వైసీపీని ఒడించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావాలని చెప్పిన పవన్ ఇవాళ నేను సెపరేట్ అంటున్నారు..బీజేపీ, వైసీపీ ఒకరికొకరు ఒద్దికగా పరస్పరం కలిసి పోయారు..
కేంద్రానికి ప్రతీ విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారు.బీజేపీ, వైసీపీలు పెళ్లి చేసుకోలేదు కానీ కలసి కాపురం చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ బీజేపీ ని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే ఆయనను ఆమాయకుడు అనుకోవాలా..పవన్ అన్నీ తెలిసే నటిస్తున్నాడా..వచ్చే ఎన్నికల్లో గలవకపోతే అవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు అనటంలో తప్పులేదు..కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ను గద్దె దించేందుకు ఎవరినైనా కలసి నడుస్తాం..ఏపీలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తుందన్నారు రామకృష్ణ.