వైసీపీ-బీజేపీలపై విమర్శలు గుప్పించా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ-బీజేపీ మధ్య బంధం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ-బీజేపీ బంధం గురించి చెప్పినందుకు వైసీరీ ఎంపీ శ్రీధరును అభినందిస్తున్నానని, రాష్ట్రానికి నిధులిస్తున్నారని చెప్పారు.. ఏమిచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతిచ్చామని చెప్పారని, రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలన్నారు రామకృష్ణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే వైసీపీ మాట్లాడలేదని, నరేష్, పవిత్ర లోకేష్ మాదిరిగా పెళ్లి కాకుండా బీజేపీ, వైసీపీ సహజీవనం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
గత మూడేళ్లుగా బీజేపీ-వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారన్న రామకృష్ణ.. షరతులతో బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ చేరతామంటున్నారన్నారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ, పాఠశాలలను మూసేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంగ్లీష్ మీడియమని చెప్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని, ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల సమస్యలపై ఢిల్లీ స్థాయిలో పోరాడతామని ఆయన వెల్లడించారు.