Dadisetti Raja Sensational Comments On Pawan Kalyan: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం.. ఇదీ పవన్ పార్టీ పరిస్థితి’’ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో పవన్‌కు డీల్ కుదిరిందని, ప్యాకేజ్ సెట్ అయ్యిందని ఆయన ఆరోపణలు చేశారు. పవన్ పెట్టిన పార్టీ ‘జనసేన’ కాదని, ‘నారా-నాదెండ్ల’ సేన అని ఎద్దేవా చేశారు. పవన్‌కు కావాల్సింది కేవలం ప్యాకేజీ మాత్రమేనని అన్నారు. రాజకీయం అంటే సొంత కళ్యాణం కాదు, లోక కళ్యాణం అంటూ హితవు పలికారు.
మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా, పవన్‌కు వేరే ఆఫీస్ ఎందుకని దాడిశెట్టి ప్రశ్నించారు. రాజకీయ కరువు బాధితుడు అయిన పవన్‌కు స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు అందాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో దుష్టచతుష్టయం, పవన్‌ల కడుపు నిండిందని.. జనం కడుపు మాత్రం ఎండిందని తీవ్రంగా ఆరోపించారు. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టి, పవన్ జుట్టు పెంచుతున్నాడని సెటైర్లు వేశారు. నిన్ను చిరంజీవి తమ్ముడు అనాలా? లేక చంద్రబాబు దత్తపుత్రుడు అనాలా? అంటూ దాడిశెట్టి ప్రశ్నించారు. ప్రతి నమస్కారంతోపాటు ప్రతి ఒక్కరికీ మంచి చేసే సంస్కారం ఏపీ సీఎం జగన్‌కి మాత్రమే సొంతమని ఆయనన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా పని చేస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే దాడి శెట్టి అలా స్పందించారు.