తూర్పుగోదావరిని వణికిస్తున్న డెంగీ, టైఫాయిడ్

0
737

డెంగీతో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల తో హాస్పటల్స్ కి క్యూ కడుతున్నారు జనాలు. ఇప్పటికే గత నెల రోజులుగా డెంగ్యూ తో ప్లేట్ లెట్స్ పడిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో బెడ్ లు ఖాళీ లేక తిప్పలు పడుతున్నారు. వర్షా కాలం సీజన్ లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి..ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా జిల్లాలో 309 డెంగీ కేసులు నమోదు కాగా,ఆందులో గత నెల రోజుల్లోనే 250 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది… అనధికారికంగా ఈ లెక్కలు 1000 కి పైనే ఉంటాయి.. రోజులు గడుస్తున్న జ్వరం తగ్గక ప్లేట్ లెట్స్ పడిపోయి ఇబ్బందులు పడుతున్నారు.. గ్రామాలు, అర్బన్ ఏరియాలు అనే తేడా లేకుండా బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు… పరిస్థితి విషమిస్తే కాకినాడ జిజిహెచ్ కి వస్తున్నారు బాధితులు… దాంతో గత పది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీ బాధితుల ఫ్లోటింగ్ పెరిగింది.

ఇప్పటికే రోగుల సంఖ్య పెరగడంతో 100 బెడ్ల తో ప్రత్యేక డెంగీ వార్డ్ ఏర్పాటు చేశారు.. అయినా గాని రోగులు తాకిడికి అది సరిపోవడం లేదు.. దాంతో ఏం చేయలేని సిబ్బంది ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు… అలాంటి సందర్భాల్లో వారికి ట్రీట్మెంట్ చేయడానికి సెలైన్లు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు… పేషంట్ లతో పాటు ఉన్న సహాయకులు కూడా ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది.. జిల్లాలో డెంగీ బాధితుల్లో చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు… జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులతో తీవ్ర అలసటకి గురవుతున్నారు… కొంతమందిలో ప్లేట్లెట్స్ అప్పటికప్పుడు డౌన్ అయిపోవడంతో ప్రాణాల మీదకి వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇంట్లో పిల్లల్లో ఒకరికి వచ్చి తగ్గేలోపు మరొకరు డెంగీ బారిన పడుతున్నారు.. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నప్పటికీ సామాన్యులు రోజుల తరబడి టెస్టుల కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.

దోమకాటుతో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు.. వర్షాలు కురుస్తుండడంతో నిలువ నీరు పెరిగిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆర్ఎంపి క్లినిక్ లు పెద్ద ఆసుపత్రుల వరకు రోగుల తాకిడి గత నెల రోజులుగా పెరిగింది ఈ వైరల్ ఫీవర్ సీజనల్ వ్యాధులు మరొక రెండు నెల రోజుల వరకు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు… దొరికిందే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగుల దగ్గర్నుంచి పీల్చి పిప్పి చేస్తున్నాయి… రకరకాల టెస్టులు పేరుతో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో టెస్ట్ రిపోర్టులు రోజులు తరబడి రాకపోవడంతో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని ముందుగానే ప్రైవేట్ హాస్పటల్స్ కి పరుగులు పెడుతున్నారు .. ప్లేట్లెట్స్ పడిపోయి అవయవాలు పనిచేయక రక్తం కక్కుకునే స్థాయి లో ఉంటే డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది… ప్రైవేట్ ల్యాబ్ ల దగ్గర రక్త పరీక్షల కోసం బారులు తీరుతున్నారు పేషెంట్లు.. గత కొద్ది రోజులుగా కాకినాడ జిజిహెచ్ లో ఓపితో పాటు పేషంట్లు జాయినింగ్ సంఖ్య కూడా పెరుగుతుంది.. ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జ్ అవుతుంటే కొత్తగా నలుగురు జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here