ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట లభించేనా?

0
87

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట లభించింది. ఎమ్మెల్యే రాపాక ఎన్నిక ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ పూర్తి చేశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నిక ఫిర్యాదుపై విచారణ పూర్తి అయింది. మార్చిలో అంతర్వేదిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో తాను ఎన్నికల్లో గెలు పొందేందుకు దొంగ ఓట్లు దోహదపడినట్లు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదుపై అధికారులు విచారణ జరిపారు.

ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రాపాక వర ప్రసాద్ తో పాటుగా మరో ఎనిమిది మందిని విచారణ చేసి, వీరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు జిల్లా కలెక్టర్. విచారణలో గత ఎన్నికల్లో తాము అసలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఓట్లు వేయలేదని వైసీపీ కార్యకర్తలు తెలిపారు. తాము వైసీపీ కార్యకర్తలమని, అలాంటిది జనసేన తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు ఏ విధంగా దొంగ ఓట్లు వేస్తామని చెప్పారు కార్యకర్తలు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదంపై పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల కమీషన్ కు అందజేయనున్నారు కలెక్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here