మనుషులు ఊరు దాటితే వన్యప్రాణులు అడవి దాటతాయి.. మనిషి వన్యప్రాణుల ఆవాసాన్ని కాలరాస్తే.. వన్యప్రాణులు మనుషుల ఆయువుని ఆపేస్తాయి..అందుకే మనిషి హద్దుల్లో ఉంటె వన్యప్రాణులు అడవుల్లో ఉంటాయి.. లేదంటే ఆవాసం ఆహరం దొరకక అరణ్యాన్ని వదిలి జనం మధ్యకి వస్తాయి.. మనిషినే ఆహారం అంకుంటాయి అని ఇదివరకే నిరూపితమైనది.. స్వార్థపరుల ఆకృత్యాలకు అమాయక ప్రజలు వ్యానప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు.. ఆంధ్రాలో అతి పవిత్రమైన తిరుమల కోవెలకి వెళ్తూ పసిపా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. వైజాగ్ లో చిరుత అనే వార్త కలకలం సృష్టిస్తుంది..
విశాఖ నగరం పరిధిలోని ఎండడాలో ఎంకే గోల్డ్ అపార్ట్ మెంట్స్ ఉంది.. దీనిలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గణేష్ అపార్ట్ మెంట్ వెనుక చిరుత సంచరించడం చూశానని చెప్పాడు.. దీనితో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.. గడపదాటి అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు..
అయితే.. స్థానికుల సహకారంతో ఫారెస్టు అధికారుల దృష్టికి సమాచారం వెళ్ళింది. వెంటనే ఈ విషయంపైన స్పందించిన కంబలా కొండ అభయారణ్యం పర్యవేక్షణ సిబ్బంది చిరుత సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్న ప్రాంతాన్నీ పరిశీలించారు. తదనంతరం చిరుత సంచరిస్తున్నటు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలియచేసిన పర్యవేక్షణ సిబ్బంది.. అది అడవి పిల్లి అయ్యుండొచ్చని పేర్కొన్నారు.. కాగా ముందు జాగ్రత్తగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు ఫారెస్ట్ అధికారులు..