నేటి నుంచి బారాషహీద్‌ రొట్టెల పండుగ

0
147

నేటి నుంచి నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్‌ రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. ఈ దర్గాకు దేశ, విదేశాల్లో ఎంతో ప్రాశస్త్యం పొందిన నెల్లూరు బారాషహీద్‌ దర్గా రొట్టెల పండగ నేటి నుంచి 13 వరకు జరగనుంది. ఈ మేరకు జిల్లా వక్ఫ్‌బోర్డు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే.. రెండేళ్లుగా కరోనా వల్ల ఉత్సవం వైభవంగా నిర్వహించలేదు. ఇప్పుడిప్పుడే కోరానా కాస్తా తగ్గడంతో లక్షల్లో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

<em><strong>బారాషహీద్‌ దర్గా రొట్టెల పండగ</strong></em>
9న షాహాదత్‌ రోజున సొందల్‌మాలీ,
10న రాత్రి గంధోత్సవం,
11న రొట్టెల పండుగ,
12న తహలీల్‌ ఫాతెహా,
13న ముగింపు ఉత్సవం ఉంటుందని రొట్టెల పండగ కమిటీ తెలిపింది.

ఈ దర్గాకు చారిత్రక నేపథ్యం ఉన్న విశేషమైన ఆరోగ్య చరిత్ర కూడా ఉంది. ఈ మట్టి పవిత్రం, ఈ నీరు పవిత్రం అని చెబుతారు. ఇక్కడ 12 మంది యుద్ధ వీరుల మరణానికి చిహ్నంగా దర్గా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పటికా 12 సమాధులు ఇక్కడ ఉండడమేకాదు..ఈ సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. బాహాషహీద్ దర్గా గంధ మహోత్సవం రోజున, దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ విద్యా రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తారు.

ఈనేపథ్యంలో.. ఒక ఏడాది రొట్టె తీసుకుని తమ కోర్కె నెరవేరితే, మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆయా ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇస్తుంటారు. ఇక్కడ ఆరోగ్య రొట్టెకు ఎక్కువ డిమాండ్ .. ఇక్కడి రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. కరోనా వల్ల రెండేళ్లుగా రొట్టెల పండగను కేవలం ముజావర్ల సమక్షంలోనే రొట్టెల పండగ జరిగింది. కరోనా కారణంగా భక్తులను నెల్లూరుకి అనుమతించ లేదు. రెండేళ్ల తరువాత ఈ ఏడాది గతంకంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేశామని దర్గా కమిటీ నిర్వహకులు సయ్యద్ సమీ వెల్లడించారు. అయితే.. రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here