కలియుగ దైవం వెంకటేశ్వర స్వామీ దర్శనానికి భక్తులు ఆరాటపడుతుంటారు.. కాలినడకన వెళ్లి ఆయ్యన్ని దర్శించుకోవాలని ఆశపడుతుంటారు.. కాగా ప్రస్తుతం కాలినడకన తిరుమల వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు.. కారణం ఆ ప్రాంతాలలో చిరుతల సంచారం..
గతంలో ఒక అబ్బాయి చిరుత దాడిలో తృటిలో తపించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ దురదృష్ట వశాత్తు ఓ చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలను కోల్పోయింది.. ఆ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కలిచి వేసింది.. అలానే టీటీడీ నిర్లక్ష్య వైఖరిని ప్రజలు తప్పుపట్టారు..
దీనితో తిరుమలలో “ఆపరేషన్ చిరుత” ని ప్రారంభిచారు.. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 4 చిరుతలు బోన్ లో చిక్కగా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.. కాగా తాజాగా నిన్న మరో చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోన్ లో చిక్కింది.. దీనితో చిరుతల సంఖ్య 5 కి చేరింది..
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. 4 రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దాని సంచారాన్ని గుర్తించి.. బోను ఏర్పాటు చేయగా.. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది.. అయితే, తిరుమలలో ‘ఆపరేషన్ చిరుత’ కొనసాగుతుందని అని తెలిపారు.. ఇప్పటి వరకు ఐదు చిక్కినా..
మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నమాట.. అయితే, ఇప్పటికే ఐదు చిరుతలు చిక్కడంతో.. ఇక, నడకదారిలో పెద్దగా ఇబ్బందులు ఉండవనే చర్చ కూడా సాగుతోంది. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28 తేద్దీల్లో చిరుతను బంధించిన అటవీశాఖ అధికారులు.. తాజాగా అంటే సెప్టెంబర్ 6వ తేదీన ఐదో చిరుతను కూడా బంధించగలిగారు.