సీఎం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి పోలీసు సేవలు మెరుగు పరిచారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎదైనా ఘటన జరిగితే అందులో నిజానిజాలు బయటికి రావాలి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరమని, గతంలో నమూనాలను తిరుపతికి పంపేవారని గుర్తు చేసారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో త్వరితగతిన కేసులు ఛేధించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నారు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తూ కేసులు త్వరితగతిన నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. గతం లో పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది గా ఉండేదని అన్నారు.
read also: Weather Report : తెలంగాణకు భారీ వర్ష సూచన..
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పోలీసు సేవలు మెరుగు పరిచారని అన్నారు. దిశా యాప్, ల్యాబ్ ల ఏర్పాటు వంటి వాటితో త్వరితగతిన సేవలు పొందే అవాశముందని తెలిపారు. టెక్నాలజీ ని ఉపయోగించుకొని పోలీసు శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఛేదించటంలో ఫోరెన్సిక్ ఫలితాలే కీలకమని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతోనే ఫోరెన్సిక్ ల్యాబ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుమన్నాని ఆమె స్పష్టం చేశారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో స్పందించేలా వ్యవస్థలో మార్పు తెచ్చామని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుందన్నారు. వైఎస్ జగన్ కృషి వల్లే దిశా చట్టం తెచ్చామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.