నగరాన్ని ముంచెత్తిన వాన.. రేపు భారీ వర్ష సూచన

0
23

భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ప్రజలు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం వుందని, ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.

read also: Common Wealth Games 2022: కొనసాగుతున్న భారత క్రీడాకారుల హవా.. 9కి చేరిన పతకాల సంఖ్య

వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని ప్రకటించారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం వుందని, కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనదారులు ఇతర మార్గాలను వెళ్లాల్సిన అవసరం వుందని జాయింట్ సీపీ సూచించారు. అయితే.. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించింది. కాగా..మరోవైపు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల నేడు ఒక మోస్తరుగా, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

#2AUG 8:20AM⚠️

HEAVY RAIN ALERT FOR Many Parts of the City in Next 2Hrs.

STAY ALERT..!⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/CKg2x5ZXps
— Hyderabad Rains (@Hyderabadrains) August 2, 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here