తడిసి ముద్దయిన తెలుగు రాష్ట్రాలు.. 48 గంటల పాటు భారీవర్షాలు

0
605

ఎడతెరిపి లేని వానలతో తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగడంతో భైంసా-బాసర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు.

చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మ ం జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. కిన్నెరసాని పొంగిపొరలుతోంది. రాబోయే అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. 2.21 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 13.63 అడుగులకు చేరింది బ్యారేజ్ నీటిమట్టం. 175 గేట్ల ద్వారా వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్దకు వరద నీరు పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో లేనంతగా ఈఏడాది జూలైలోనే భారీ వరద రావడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. గోదావరికి ఆకస్మిక వరదల నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here