కిటకిటలాడుతున్న తిరుమల

0
180

సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జూన్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో సహ ప్రత్యేక దర్శనాలను కుదిస్తున్నాం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి .ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల సామాన్య భక్తులుకు వసతి గదులు కేటాయింపు సులభంగా మారిందన్నారు. రద్దీ నేపథ్యంలో వివిధ కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులుకు నిరంతరాయంగా అన్నప్రసాద సదుపాయం కల్పిస్తున్నాం.. ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీవరకు పద్మావతి పరిణయోత్సవాలు…మే 2 నుంచి 5వ తేది వరకు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహిస్తున్నాం అన్నారు ఈవో ధర్మారెడ్డి.

ఆ ఆపద మొక్కులవాడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుపతికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాస వసతి సముదాయాల వద్ద గంటల తరబడి టోకెన్ల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. చంటిబిడ్డలు, వృద్థులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరుస మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కోసం రెండు, మూడు టీటీడీ సత్రాల వద్దకు చేరుకున్నారు భక్తులు. ఇంకా వేసవి సెలవులు రాకుండానే ఈ స్థాయిలో భక్తులు రావడంతో దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లుచేశారు. కాగా తిరుమలలో గత కొద్దికాలంగా 60 నుంచి 70వేలమంది దర్శనానికి వస్తున్నారు. శుక్రవారం 30 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచివున్నారు భక్తులు..టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు గా టీటీడీ తెలిపింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here