గిరిజనరైతులకు శ్రీశైలం దేవస్థానం గోసంరక్షణశాల కోడెదూడలు 

0
756

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాలలోని కోడెదూడలను చెంచు గిరిజన రైతులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అందజేశారు. గడప గడపకు ప్రభుత్వం పర్యటన మూడవ రోజులో భాగంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక చొరవతో మూడు జిల్లాల గిరిజన రైతులకు డిప్ ద్వారా కోడెలు,కోడెదూడలను అందజేశారు. సుమారు 107 కుటుంబాలకు 214 కోడెలు,కోడెదూడలను చెంచు గిరిజన రైతుల వినియోగానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అందజేశారు. అయితే కోడెలను, కోడెదూడలను గిరిజన రైతులు వారి గ్రామాలకు తీసుకెళ్లేందుకు సుమారు 61 వేలను తన సొంత డబ్బులను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్వయంగా గిరిజనులకు అందజేశారు.

మరోపక్క ఎన్నో సంవత్సరాలుగా మూతపడిన గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సైతం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలోని సుమారు 60 మంది బాలికల విద్య కోసం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ గిరిజనులు ఉన్నత చదువులు చదవాలన్నారు. ప్రభుత్వం పేదలకు ఉన్నత విద్యను అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోందన్నారు. పై చదువుల చదివేందుకు ఎవరూ బాధ పడకూడదని ఇప్పటికే గిరిజనులకోసం క్షేత్రపరిధిలో 30 దుకాణాలు అందజేశానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. గిరిజన రైతులు శ్రీశైలం దేవస్థానానికి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here