ఏపీలో మద్యపాన నిషేధంపై విపక్షాలు అధికార పార్టీని విమర్శిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యంపై ఆదాయం వద్దన్న సీఎం.. మద్యం పాలసీ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. జనసేన ప్రారంభించిన నాటి నుంచి ప్రజా క్షేత్రంలో వుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 4వేలు వుండే టన్ను ఇసుక ధర 28 వేలకు అమ్ముతున్నారు. మూడో విడత ” జనవాణి – జనసేన భరోసా ” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా రాజధాని భీమవరంలో నిర్వహించారు జనసేనాని పవన్ కళ్యాణ్,
ఎస్సీలకు అండగా ఉంటామని వారిపై కేసులు పెడుతున్నారు. భీమవరంలో మాదిరిగానే అన్ని చోట్ల డంపింగ్ యార్డ్ ల సమస్యలు వేధిస్తున్నాయి. వైసీపీ నవ రత్నాల్లో కీలకమైన అంశం.. సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామన్న ప్రభుత్వం ఇపుడు నేరుగా మద్యం అమ్ముతుంది. 19సూట్ కేస్ కంపెనీ లు తయారు చేస్తున్న మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వకుండా నేరుగా డబ్బు దోచుకుంటున్నారు. మద్యం పై ఆదాయం వద్దన్న వారు కొత్త మద్యం పాలసీ ద్వారా 30వేల కోట్లు సంపాదించాలి అని చూస్తున్నారని పవన్ విమర్శించారు.
ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జిలు ఉన్నాయి , కనీస మరమ్మత్తులు కూడా జిల్లాలో లేవు. ఉభయ గోదావరి జిల్లాలో డయాలసిస్ కేసులు చాలా పెరిగిపోతుండటం ఆందోళనకరం. దీనికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు పవన్. జనవాణిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి భారీ స్పందన లభించిందని జనసేన పార్టీ నేతలు తెలిపారు. ఈరోజు దాదాపు 492 అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా పంచాయితీ రాజ్, రోడ్లు, ఆర్థిక శాఖ, వైద్య శాఖ, ప్రభుత్వ పథకాల మీద ప్రజలు అర్జీలు సమర్పించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.