మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. మరోసారి ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాయలంలో వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.. అయితే, ఈ లోగా హైకోర్టును ఆశ్రయించారు అవినాష్‌రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, ముందస్తు బెయిల్ పిటిషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు అవినాష్‌రెడ్డి.. వైఎస్ వివేకా హత్యతో నాకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే, వైఎస్ వివేకా కూతురు సునీత.. సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతతో కలిసి కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. సునీతకు వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా అనుకూలంగా వ్యవహరించినందుకే సునీత కక్ష గట్టిందన్నారు.. వివేకానందరెడ్డి తన రెండో భార్య కొడుకుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.. అంతే కాకుండా స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు.. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ప్లాన్ కూడా చేశారు.. అయితే, ఇదంతా సునీతకు తెలిసి.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..