క్షత్రియ సేవా సమితి ఏపీ, తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరిసీతారామరాజు జిల్లాలో చింతపల్లి గ్రామంలో కేంద్ర గిరిజనశాఖామాత్యులు అర్జున్ ముండా ముఖ్య అతిధిగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశిష్ట అతిధిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజన్న దొర, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి శుభద్ర, ఎంపీ శ్రీమతి మాధవి, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి భాగ్యలక్ష్మి …ఇతర గిరిజన ఎమ్మెల్లేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ITDA PO, ST కమిషిన్ చైర్మన్ ఎమ్మెల్సీ రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీసూర్యనారాయణ రాజు వంటి వారి సమక్షంలో శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
NCC వారి సహకారంతో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 11 ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ముఖ్య అతిధుల చేతుల మీదుగా ఇది జరగడం ఈ కార్యక్రమానికే హైలైట్. ప్రతి వక్త క్షత్రియుల ఉన్నతిని ప్రత్యేకంగా చెప్పడం, మన్యం తిరుగుబాటు ఆనవాళ్లను గుర్తించి వాటిని పునరుద్ధరించి …. కాపాడుకోవడానికి క్షత్రియ సేవ సమితి చేస్తున్న కృషిని మెచ్చుకోవడం యావత్ క్షత్రియ జాతికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం క్షత్రియ పరిషత్ విశేషంగా సహకరించారు. తమ ఇంటిలో శుభకార్యం లా భావించి దూర ప్రాంతాలనుండి అసంఖ్యాకంగా తరలి వచ్చారు. అంతేకాకుండా స్థానిక సంస్థలు, స్థానిక అధికారులు అద్భుతంగా మనతో కలసి పనిచేయడం అద్భుతం. మన్యం లో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద కార్యక్రమం అని స్థానికులు చెప్పడం అతిపెద్ద ప్రశంస. ముఖ్య అతిధులు అందరూ అల్లూరి సీతారామ రాజు గారిని పదే పదే తలుచుకోవడం, ఆయన స్ఫూర్తి తెలుగు వారికే కాదు యావత్ దేశానికి ఆదర్శం అని ముగించారు.
త్వరలో…. అల్లూరి ఘనతని మరింత పెంచే విధంగా, క్షత్రియ జాతి గౌరవం మరింత పెరిగే కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి తెలిపింది. కార్యక్రమానికి తమవంతు సహకారం అందించిన NCC వారికీ ధన్యవాదములు తెలిపారు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు , ప్రధాన కార్యదర్శి నాని నడింపల్లి.