Married Woman Illegal Affair With Minor Boy: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన తాజాగా వెలుగు చూసింది. భర్త, నలుగురు పిల్లలు ఉన్న ఓ వివాహిత మహిళ.. మైనర్ బాలుడ్ని కిడ్నాప్ చేసి, అతనితో సహజీవనం చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నివసిస్తోన్న ఓ వివాహిత (31), తన ఎదురింట్లో ఉండే ఓ 14 ఏళ్ల బాలుడికి ఆకర్షితురాలైంది. దీంతో, అతనికి మాయమాయలు చెప్పి శారీరకంగా లోబర్చుకుంది. దీంతో.. ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు.
ఇది గమనించిన ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులు.. ఆమె ఇంటికి వెళ్లొద్దని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. ఆ అబ్బాయి తనకెక్కడ దూరం అవుతాడోనని ఎస్కేప్ ప్లాన్ వేసింది. ఈనెల 19వ తేదీన బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి, బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తోంది. అయితే.. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని, ఆ బాలుడ్ని వెతుకున్న పోలీసులు.. అతని ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ కనుగొన్నారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్నారని తెలిసి, మంగళవారం రాత్రి వారి ఇంటికెళ్లారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, బుధవారం గుడివాడకు తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ వివాహితపై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.