నేను రాజీనామాకు రెడీ.. మీ ఎన్నికలు సిద్ధమా..? మేకపాటి సవాల్‌

0
161

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెంచాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇందులో 6 స్థానాలు వైసీపీ, మరోస్థానాన్ని అనూహ్యంగా టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి ఏడు స్థానాలు నెగ్గుతామని ధీమాగా ఉన్న వైసీపీ నాయకత్వానికి ఈ పరిణామం షాక్‌ ఇచ్చింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. నాకు ఇచ్చిన లిస్ట్‌ ప్రకారం.. వైసీపీ అభ్యర్థికే ఓటు వేశా.. నేను ఓటు వేసిన అభ్యర్థి విజయం సాధించారు.. కానీ, రహస్య బాలెట్‌లో జరిగిన విధానంలో.. నేను ఓటు వేయలేదని ఎలా గుర్తించారని మండిపడ్డారు..

నన్ను సస్పెండ్‌ చేశారు.. ఎమ్మెల్యే పదవి కూడా మా పార్టీ వల్ల వచ్చిందని అంటున్నారు.. గనుక నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. నేను రాజీనామా చేసిన వెంటనే ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి.. ఇక, వైసీపీ ఆరోపించినట్టు.. నేను కటప్పను కాను.. జగన్‌ దగ్గరే చాలా మంది కట్టప్పలు ఉన్నారన్నారు.. అందరికీ దేవుడు ఉన్నాడు.. నన్ను ఎంతో క్షోభపెట్టారు.. గుండెపోటు వచ్చేలా టెన్షన్‌ పెట్టారని ఆరోపించారు. నా నియోజకవర్గంలో ఎంతో మందిని దించారు.. ఎమ్మెల్సీ టికెట్‌ కూడా ఇచ్చేది లేదన్నారు.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. కానీ, అది అయ్యేది ఎప్పుడో అన్నారు.. కానీ, నేను ఎలాంటి డిమాండ్‌ చేయలేదు.. మంత్రి పదవి అడగలేదు.. ఎలాంటి పదవి కావాలని అడగలేదు.. ఒకవిధంగా నేను సీరియస్‌ని.. మంత్రి పదవి ఇస్తే నాకే ఇవ్వాల్సి ఉండే.. కానీ, మా సోదరుడి కుమారుడు గౌతమ్‌కు ఇచ్చారు.. అయినా సంతోషమే.. కానీ, ఆయన టైం సరిగాలేక కాలం చేశారని వ్యాఖ్యానించారు. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన మేకపాటి.. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here