వైసీపీ నేతల మాటల దాడి తారస్థాయికి చేరుకుంటోంది. చంద్రబాబు, పవన్ లపై తనదైన రీతిలో పంచ్ లు వేశారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ప్లీనరీలో చర్చించే అంశాలను మంత్రి అంబటి రాంబాబు వివరించారు. వైఎస్ఆర్ చేయలేని సంక్షేమ పనులు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు. దుష్ట చతుష్టయం కలసి వచ్చినా జగన్ ను ఓడించలేరన్నారు. రాబోయే ప్లీనరీలో ఎన్నికల యుద్దభేరి మోగించబోతున్నాం అన్నారు అంబటి.
చంద్రబాబుని కుప్పంలో ఓడించి తీరుతాం. చంద్రబాబు, సొంత పుత్రుడితో వచ్చినా,దత్త పుత్రుడితో వచ్చినా కృష్ణానదిలో కలపడానికి వైసీపీ క్యాడర్ రెడీగా వుందన్నారు. చంద్రబాబు ,పవన్ లు కలిసినా మళ్ళీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవుతారు. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి సిద్దంగా లేడు. చంద్రబాబుని సీఎం చేయడానికి పవన్ కార్యకర్తలను వాడుకుంటున్నాడు. ప్లీనరీలో తీసుకోబోయే నిర్ణయాలు చరిత్రాత్మకంగా నిలవబోతున్నాయన్నారు. లక్షా యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి. టీడీపీ మహానాడు నిర్వహించినప్పడు నుండి టీడీపీ నాయకుల నోటికి హద్దు లేకుండా పోయింది. అయ్యన్న నోరు మరుగుదొడ్డి లా తయారయ్యింది. చంద్రబాబు మోసాలు చేసే రాజకీయ నాయకుడు. స్వంత కుటుంబాన్ని మోసం చేసి సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.