తిరుమలలో 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు హల్ చల్

0
1180

తిరుమలలో రాజకీయ నేతల సందడి ఎక్కువవుతోందా? తరచూ నేతలు దర్శనానికి రావడం, తమతో పాటు వందలాదిమందిని తీసుకురావడంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిత్యం వార్తల్లో వుంటుంటారు. గతంలో అనేకసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు మంత్రి అప్పలరాజు. తాజాగా మంత్రి అప్పలరాజు కలియుగ వైకుంఠం తిరుమలలో హల్ చల్ చేశారు. భారీగా అనుచరులతో తిరుమల చేరుకున్నారు మంత్రి అప్పలరాజు. తన అనుచరులందరికి ప్రోటోకాల్ దర్శనం కల్పించాలటూ టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. అసలే మంత్రి.. ఆయన వత్తిడికి టీటీడీ తలొగ్గాల్పిందే మరి. అప్పలరాజు ఒత్తిడితో టీటీడీ అధికారులు తలవంచకతప్పలేదు. నిబంధనలు ప్రక్కన పెట్టి 140 మంది అనుచర వర్గానికి ప్రోటోకాల్ దర్శన కల్పించింది టీటీడీ. నిబంధనల ఉల్లంఘనపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో రెండవసారి మంత్రి పదవి పొందారు సీదిరి అప్పలరాజు.

గతంలోనూ జగన్ పర్యటనలో శారదా పీఠం దగ్గర పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో శారదాపీఠంలో సీఎం జగన్ పర్యటించారు. జగన్ విశాఖ పర్యటన సందర్బంగా పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శారదాపీఠం ద్వారం వద్ద పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. ఈసమయంలోనే సీఐకి, మంత్రికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here