వైసీపీ ప్లీనరీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. ఏపీలో రాజధాని నాటకం గురించి మాట్లాడతా. ముందు నూజివీడు అన్నారు. కానీ అమరావతిలో ఏరియాలో వందల ఎకరాలు కొనేశారన్నారు ఎంపీ నందిగం సురేష్. అమరావతిలో పచ్చటి పొలాలు తగులబెట్టారు. రైతులు భయపెట్టారు. రైతులంతా రోడ్డుమీదకి వచ్చారు. తుళ్లూరులో వేలాదిమంది తమ ఇళ్ళకు వెళ్లలేరు. తుళ్ళూరులో కేక్ కట్ చేశారు. మాలాంటి వారిమీద కేసులు పెట్టారు.
నన్ను నమ్మండి అన్నారు. వర్షం కారిపోయే అసెంబ్లీ కట్టారు. ఎల్ సీడీలు పెట్టారు. రాజధాని నాటకం ఆడారు. రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. అవన్నీ తప్పుడు తడకలు. నాకు సంబంధించినవారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మీరు అమరావతి రావడానికి, మోడీని చూడడానికి రానివ్వలేదు. ఇప్పుడు మోడీ దగ్గరకు తీసికెళ్లింది జగన్మోహన్ రెడ్డి కాదు. రాజధాని మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. చంద్రబాబు ఒక్కచోటే డెవలప్ కావాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. మూడు రాజధానులు రావాలి. జగన్ అన్నకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు. చంద్రబాబుకి ఒక్కడే కొడుకు, ఒక్కడే మనవడు. మన పిల్లలు రెండుచోట్ల పైకి రావాలని వుంటుంది. జగన్ ఆలోచన కూడా అదే. అభివృద్ది అన్ని ప్రాంతాల్లో కావాలి. మూడురాజధానుల బిల్లు త్వరలో వస్తుందన్నారు ఎంపీ నందిగం సురేష్