మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. నెల్లూరు సిటీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.. పోలీసులు కూడా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించిన ఆయన.. ఎవరో ఫొన్ చేశారని మా కార్యకర్తలను తాక వద్దు అని హెచ్చరించారు.. గతంలో పెద్ద పెద్ద కుటుంబాలతో పోరాడి నిలబడిన చరిత్ర మాది… ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి మేము హెచ్చరిక చేస్తున్నాం.. పాము తన గుడ్లను తానే తిన్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని స్పష్టం చేశారు.
జగనన్న భవన్ ప్రారంభోత్సవానికి వచ్చారని మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమన్నారు రూప్ కుమార్ యాదవ్.. జగనన్న భవన్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే.. ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని ప్రకటించారు… పోలీసులను పంపించి మమ్మల్ని ఏదో చేయాలంటే అది మీ అమాయకత్వం అవుతుందని ఎద్దేవా చేసిన ఆయన.. మా కార్యకర్తలను అరెస్టు చేస్తే 5 నిమిషాల్లో బయట తీసుకు వచ్చాం.. ఏమైంది మీ పరువు అంటూ పరోక్షంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను టార్గెట్ చేశారు.. రూప్ కుమార్ శక్తి ఏందో అందరికీ తెలుసు.. మాతో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.