తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఇక.. నిజామాబాద్‌లో ఛారిటీ పేరుతో ఫండ్స్ వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారన్న కారణంతో సయ్యద్ షాహిద్‌కు ఎన్ఐఏ నోటీసులు అందించింది.