బూతులు మాట్లాడే పార్టీ ఎవరిదో చిన్నపిల్లాడు కూడా చెప్తాడు

0
936

టీడీపీని బూతుల పార్టీ అంటూ నర్సాపురం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. గోదావరి జిల్లాలో పర్యటించే అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. సభలో మహిళలు అమ్మాయిల నలుపు చున్నీలను, గొడుగులు, బ్యాగులను సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా సెక్యూరిటీ తీసుకుని లోపలకు పంపించడం దారుణమన్నారు. సీఎం ప్రకటించిన సుమారు 3,800 కోట్ల పనులు ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పే దమ్ముందా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్పిన ఏ పనులకు ఇప్పటివరకు నిధులు కేటాయించడం కానీ టెండర్ పిలవడం కానీ జరగలేదని ఎద్దేవా చేశారు.

ఉత్తుత్తి బటన్ నొక్కుతూ జగన్ రాష్ట్రంలో ఉత్తుత్తి ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆక్వా రంగం ఐసీయూలో ఉందని.. ఐసీయూలో ఉన్న ఆక్వా రంగానికి ఊపిరి పోయడానికి జగన్ వచ్చినట్టు లేదని.. ఆయన అంత్యక్రియలు చేయడానికి వచ్చినట్లుందని విమర్శలు చేశారు. బూతుల పార్టీ ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. బూతులు మాట్లాడేది ఎవరు అని చిన్నపిల్లలను అడిగినా వైసీపీకి చెందిన 20 మంది నాయకుల పేర్లు చెప్తారని నిమ్మల రామానాయుడు చురకలు అంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here