హిందూ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

0
75

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఖండ్రిక గూడెం నుండి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం సీతారామ స్వామి ఆలయానికి రెండు వందల మంది రామ భక్తులు పాదయాత్ర గా బయలుదేరారు. గత ఆరు సంవత్సరాలనుండి ఖండ్రికగూడెం షిరిడి సాయిబాబా ఆలయం నుండి ఏటా రెండు వందల మంది భక్తులు 150 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర గా భద్రాద్రి రామ దర్శనానికి వెళ్తున్నామని సాయిబాబా ఆలయ స్వామీజీ సీతా రామాంజనేయులు తెలిపారు.

హిందూ ధర్మ పరిరక్షణ కొరకు, అన్యాక్రాంతమవుతున్న భద్రాద్రి రాముని ఆస్తుల పరిరక్షణ కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని సీతా రామాంజనేయులు తెలిపారు. ఈ పాదయాత్ర నాలుగురోజుల పాటు సాగుతుందని మొదటి రోజు అశ్వారావు పేట లో స్టే చేస్తామని రెండవ రోజు కుకునూరు లో స్టే చేస్తామని, మూడవరోజు బూర్గంపాడు లో స్టే చేస్తామని నాలుగవ రోజుకు 150 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయానికి చేరుకుంటామని తెలిపారు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు హిందువు గా జీవించాలని, హిందువు గా గర్వించాలని సీతారామాంజనేయులు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here