2022లో పల్నాడు జిల్లాలో 15 పీడియాక్ట్ కేసులు నమోదు

0
602

ఈఏడాది గుంటూరు జిల్లా నుంచి విడిపోయి పల్నాడు జిల్లా ఏర్పడింది. జిల్లాలో శాంతిభద్రతలపై నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన కిడ్నాప్ కేసులలో 100శాతం ఛేదించడం జరిగిందన్నారు. 2022 వ సంవత్సరంలో మర్డర్ కేసుల్లో జరిగిన 35 కేసుల్లో 32 కేసులు పరిష్కరించామన్నారు. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు నివారించడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన ఆస్తి నేరాలలో 74.42శాతం కేసులను ఛేదించడం జరిగిందన్నారు.

క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడిన వారిపై కేసులు నమోదుచేశామన్నారు. దీనికి సంబంధించి 11 మందిని అరెస్టు చేసి వారి దగ్గర 10.650 నగదు,1 లాప్ టాప్,5 ఫోన్లను సీజ్ చేయడమైనది.98 గుట్కా కేసులు నమోదు , 163 మందిని అరెస్టు చేసి వారి దగ్గర నగదు 82,58,156 విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం అని వివరించారు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. బెల్టు షాపులపై 153 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్టు చేశాం. ఈ సంవత్సరంలో మొత్తం 15 మందిపై పి.డి.యాక్ట్ కేసులు పెట్టాం. పి.డి.ఎస్ రైస్ అమ్ముతున్న వారిపై 39 కేసులు నమోదు చేసి 102 అరెస్టు చేశాం అని వెల్లడించారు ఎస్పీ.

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి… ఒకరికి గాయాలు

రోడ్లు నెత్తురోడుతున్నాయి. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడి పేట ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రి కొడుకులను వెనుక నుండి ఢీ కొట్టిన కారు, అక్కడికక్కడే మృతి చెందిన కొడుకు శివ చరణ్, తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here