Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర వాయిదా

0
644

నేడు మంగళగిరిలో జనసేన లీగల్‌ సెల్‌ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరులో యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించింది జనసేన. వచ్చే నెల నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు జనసేనాని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లే రాబోతున్నాయని, జనవాణిలో వచ్చిన ఆర్జీలను కూడా ఆధ్యయనం చేస్తున్నామన్నారు.

 

గెలిచే అభ్యర్థులనే నిలబెట్టబోతున్నామన్న పవన్‌ కల్యాణ్‌.. సమస్యలపై అధ్యయనం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అధ్యయనం పూర్తయ్యాక బస్సు యాత్ర ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే.. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచే తొలి సమీక్ష ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here