ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. నేడు తిరుపతికి జనసేనాని

0
121

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఈకార్యక్రమంలో భాగంగా.. ప్రతి ప్రాంతంలోనూ ప్రజల వద్దకు నేరుగా వెళుతూ వారి సమస్యనలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న విసయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు మూడు సార్లు నిర్వహించిన జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. ప్రజలు తమ సమస్యలను నేరుగా జనసేన అధినేత పవన్‌ దృష్టి కి తీసుకు వెళ్లారు. దీంతో ఈకార్యక్రమంలోనే తాజాగా మరోమారు జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించేందుకు నిర్ణయించింది.

జనవాణి కార్యక్రమంలో భాగంగా.. నేడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఉందయం 10 గంటలకు జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈకార్యక్రమం తిరుపతిలోని జిఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించేందుకు భారీత ఏర్పాటు చేశారు జనశ్రేణులు. జనవాణిలో పవన్‌ ప్రజలనుంచి సమస్యలను, వారి వద్ద నుంచి వినతులను పవన్‌ స్వీకరించనున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో.. ప్రజలు ఈ జనవాణి కార్యక్రమానికి రానున్నట్లు సమాచారం. జనవాని కార్యక్రమానికి ఇప్పటికే ఆదివారాల్లో పవన్‌ విజయవాడలో రెండు దఫాలుగా, భీమవరంలో ఒకసారి ఈకార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here